ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ కాంబోలో ఓ భారీ సూపర్ హీరో మూవీ రాబోతున్నట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ కెరీర్లో 25వ చిత్రంగా ఇది రూపొందనుందట. బాసిల్ ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని, అల్లు అర్జున్ను సరికొత్తగా ప్రెజెంట్ చేయనున్నారని టాక్. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.