KRNL: ఆదోని పట్టణంలో ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప అధికారులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, ఎలాంటి పక్షపాతం ఉండదని తెలిపారు. లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.