WNP:పురపాలికలో చెత్త సేకరణ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపంతో పట్టణమంతా చెత్త కుప్పలు పేరుకుపోయి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్నిచోట్ల వ్యర్థాలను తగలబెడుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చెత్త రోడ్డుపైన పారివేయడంతో దుర్వాసన వస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.