TG: రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మహమ్మారిని నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించాలని నిర్ణయించింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఈ మేరకు రిజిస్ట్రీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనుంది. దీంతో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులన్నీ విధిగా క్యాన్సర్ కేసుల వివరాలకు వైద్యశాఖకు అందించాల్సి ఉంటుంది.