TPT: తుడా 2026 – 27 బడ్జెట్ రూ.788 కోట్లతో ప్రతిపాదించగా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమోదించారు. వివిధ రూపాల్లో రూ.590 కోట్ల ఆదాయం వస్తుందని..రూ.198 కోట్లు లోటు ఉంటుందని తేల్చారు. లేఅవుట్ల అమ్మకంతో ఆ లోటు పూడ్చాలని నిర్ణయించారు. 2025-26లో రూ.136కోట్ల ఆదాయం రాగా రూ.92కోట్లు ఖర్చు చేశారు. రూ.42కోట్లు మిగులుగా లెక్కల్లో చూపించారు.