పైనాపిల్ పోషకాల నిధి. విటమిన్-C, యాంటిఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఈ పండును తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ, గుండె ఆరోగ్యం మెరుగవుతాయి. క్యాన్సర్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. అయితే షుగర్ ఉన్నవారికి ఇది ప్రయోజనం కలిగించకపోగా హానీ చేస్తుందట. ఇందుకు పైనాపిల్లో సహజ చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటమే కారణంగా నిపుణులు చెబుతున్నారు.