»Horoscope Today Todays Horoscope Results 2024 February 12th
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 February 12th)
ఈ రోజు(2024 February 12th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
విదేశీయాన ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబంలో ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అనారోగ్య బాధలు వేధిస్తాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
వృషభం
సన్నిహితుల నుంచి రుణసాయం అందుతుంది. చెడు సహవాసం వైపు వెళ్లడం వలన గౌరవం కోల్పోయే అవకాశం ఉంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.
మిథునం
మానసిక ఆందోళనకు గురి అవుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా పూర్తి అవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండండి. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.
కర్కాటకం
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. డబ్బు సమస్య ఉండదు. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.
సింహం
కుటుంబంతో ఆనందంగా ఉంటారు. సహనంవహించడం మంచిది. బంధు, మిత్రులతో గొడవలు పెట్టుకోకూడదు. అనవసర ధనవ్యయం, రుణప్రయత్నాలు జరుగుతాయి. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం.
కన్య
ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు.
తుల
ముఖ్యమైన వ్యక్తుల కలయిక మీలో మార్పును తీసుకొస్తుంది. ప్రశాంతంగా ఉంటారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది.
వృశ్చికం
ప్రయాణాలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడుతుంది. అన్ని విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.
ధనుస్సు
మనసిక ప్రశాంతత కోల్పోతారు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది. వేళకు భోజనం చేయకపోవడం వలన అనారోగ్య బాధలు వస్తాయి. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.
మకరం
ఇంట్లో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి.
కుంభం
బంధు, మిత్రులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకోసం ఎక్కువ శ్రమిస్తారు.
మీనం
నిందలు పడే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య బాధలు కలుగుతాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.