CTR: నగరి మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసిన ఏవో జ్యోతి పదవీవిరమణ కార్యక్రమానికి నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సేవలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు. పదవీ కాలంలో నిబద్ధతతో పనిచేసినందుకు అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే, భవిష్యత్తులో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.