SRPT: రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ చాటారు. పరుగులో ఆర్ఎస్సై మహేష్, జావెలిన్ త్రోలో స్వామి బంగారు పతకాలు సాధించగా, పలువురు మహిళా కానిస్టేబుళ్లు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. సోమవారం విజేతలను ఎస్పీ కె.నరసింహ అభినందించారు. క్రీడల్లో రాణిస్తే పదోన్నతుల్లో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.