AKP: రావికమతం మండలం గర్నికం దళిత కాలనీలో మంచినీటి సమస్య పరిష్కరించాలని ధైర్యత మహిళలు మంగళవారం నిరసన చేపట్టారు. 38 కుటుంబాలు ఉన్న ఇక్కడ జల్ జీవన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన పైపులు పనిచేయడం లేదని, ఉన్న బోర్ల ద్వారా కూడా నీరు సరిగా రాకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తక్షణమే సమస్య పరిష్కరించాలన్నారు.