GDWL: రాజోలి మండలం మార్దొడ్డి పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉప సర్పంచ్ భీమన్న అన్నారు. ఈ మేరకు మంగళవారం వార్డు సభ్యులతో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, DPO శ్రీకాంత్‌కు వేర్వేరుగా వినతి పత్రాలను సమర్పించారు. పంచాయతీ నిధుల గురించి అడిగితే సమాధానం చెప్పడం లేదని అధికారులకు విన్నవించారు. కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలన్నారు.