BDK: జూలూరుపాడు మండలం గుండ్ల రేవు సమీపంలో ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒరిస్సా కు చెందిన కూలీలు ద్విచక్ర వాహనంపై వస్తున్న తరుణంలో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.