W.G: అమరావతి రాజధానిపై తీర్మానం చేయడం హాస్యాస్పదమని వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు ఎద్దేవా చేశారు. మంగళవారం తాడేపల్లిగూడెం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసినా మీకు నమ్మకం లేదా? అని ప్రశ్నించారు. 3 ప్రాంతాలు ఉద్యోగ, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని జగన్ చెప్పారన్నారు.