లాస్ ఏంజిల్స్‌లోని ఐమాక్స్‌లో రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ గ్లింప్స్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘శ్రీరాముడు కేవలం పురాణ పాత్ర కాదు.. కోట్ల మంది అంతరాత్మ. కరుణ, ధైర్యం, నీతికి ఆయన నిలువుటద్దం. కష్టకాలంలో మనిషి ఎలా ఉండాలో నేర్పిన మర్యాద పురుషోత్తముడు ఆయనే. అలాంటి గొప్ప పాత్రను పోషించడం నా అదృష్టం’ అని అన్నాడు.