JGL: జగిత్యాల జిల్లాలో ఆన్ లైన్ పద్ధతి ద్వారానే ఇసుక సరఫరా జరుగుతుందని గనులు, భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు. మాన్యువల్, రసీదుల రూపంలో ఏప్రిల్ 1 నుంచి ఇసుక సరఫరా జరగదని, అన్ని మండలాల తహశీల్దార్లు, అధికారులు గమనించాలని కోరారు. జిల్లాలో ఇసుక, మొరం, గ్రానైట్, ఇతర ఖనిజాల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.