ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రి నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారు. ఇన్ఫెక్షన్తో ఈ నెల 24న రాత్రి ఆస్పత్రిలో చేరిన ఆమె.. ఈ రోజు ఉదయమే ఇంటికి చేరుకున్నారు. సమస్య నుంచి ఆమె కోలుకున్నారని, అవసరమైన చికిత్సను ఇంటి నుంచే అందించనున్నట్లు ఆస్పత్రి ఛైర్మన్, డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు.