NZB: వేల్పూర్ మండలం మోతే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మంగళవారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూన్లో ప్రారంభమయ్యే కొత్త అకడమిక్ ఇయర్ కోసం పిల్లలను సర్కారు బడిలోనే చేర్పించాలని కోరారు. ఉచిత విద్య, పుస్తకాలు, భోజనం వంటి సదుపాయాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. నాణ్యమైన చదువు కోసం ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకోవాలన్నారు.