HYD: వైద్య పర్యటన రంగంలో HYDకు మంచి ఆదరణ పెరుగుతోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల నుంచి ప్రతి సంవత్సరం రెండు లక్షలకుపైగా విదేశీ రోగులు చికిత్స కోసం వస్తున్నారు. క్యాన్సర్, ఆర్థోపెడిక్, కార్డియాక్, యూరాలజీ, న్యూరో, నెఫ్రాలజీ వంటి వివిధ వైద్య సమస్యలపై ఆశ్రయించారు.