KDP: కమలాపురం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ‘స్వర్ణ ఆంధ్ర @2047’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని 10% సంపన్నులు, అట్టడుగున ఉన్న 20% పేదలకు ప్రత్యక్ష సాయం అందించేలా సీఎం చంద్రబాబు తెచ్చిన ‘పీ4’ (ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం) తోనే పేదరిక రహిత రాష్ట్రం సాధ్యమని వివరించారు.