PPM: ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు స్దానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరుగనున్న జీరో పావర్టీ P4 కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించే సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి పథకం అమలు, పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించనున్నారు