నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి 60 ఫిర్యాదులు అందినట్లు సోమవారం ఎస్పీ సునీల్ షోరాణ్ తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆయన పేర్కొన్నారు. చట్టపరమైన సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.