నల్గొండలో చేపట్టిన రింగ్ రోడ్డు నిర్మాణంలో నాసిరకం మట్టిని వాడుతున్నారని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్ ఆరోపించారు. స్థానిక చెరువులు, కుంటల నుంచి నాణ్యత లేని మట్టిని తరలిస్తున్నారని ఆయన సోమవారం కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం ఇచ్చారు. తక్షణమే స్పందించి బాధ్యులైన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.