KDP: పులివెందుల పట్టణంలోని క్రిస్టియన్ లైన్ ప్రాంతంలో జూదం ఆడుతున్నారనే సమాచారంతో అర్బన్ CI శ్రీరామ్ సోమవారం తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జూదం ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.12,500 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.