ఖమ్మం జిల్లాలో ఇసుక సరఫరాను మరింత పారదర్శకం చేసేందుకు రూపొందించిన మన ఇసుక వాహనం మొబైల్ యాప్ను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం ప్రారంభించారు. ఏప్రిల్ 1 నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుందని వినియోగదారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే క్యూఆర్ కోడ్ ఆధారంగా ఇసుక డెలివరీ చేస్తారని ఆయన వివరించారు.