NLG: మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్ కేంద్రాన్ని సోమవారం చండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించవచ్చని తెలిపారు.