MBNR: చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలో శ్రీ కురుమూర్తి స్వామి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఆలయ సమీప కొండలపై మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని, అక్రమంగా క్వారీలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘పేదల తిరుపతి’గా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్య క్షేత్ర పవిత్రతను కాపాడాలని హిందూ సంఘాలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.