ఇటలీ నుంచి పోలాండ్ వెళ్తున్న రూ.1.5 కోట్ల విలువైన కిట్‌క్యాట్ చాక్లెట్లను దొంగలు సినిమా ఫక్కీలో చోరీ చేశారు. నకిలీ పత్రాలతో ఫ్యాక్టరీకి వచ్చి, లోడింగ్ సిబ్బందిని నమ్మించి ట్రక్కుతో ఉడాయించారు. హైటెక్ జామర్లతో జీపీఎస్ ఆపేసి మరీ ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనతో యూరప్ దేశాల్లో కిట్‌క్యాట్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని నెస్లే సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.