NDL: కొత్తపల్లి మండలం చెంచు గూడెంలో జేజేఏం నిధులు రూ.77.50 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంక్, పైప్ లైన్, కులాయి కనెక్షన్లను ఎమ్మెల్యే గిత్త జయసూర్య సోమవారం ప్రారంభించారు. అనంతరం కొత్తపల్లి గ్రామంలో రూ.1.7 కోట్లతో సీసీ రోడ్లు రూ.40 లక్షలతో సచివాలయం, రూ.23 లక్షలతో రైతు సేవ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ లింగస్వామి గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.