JN: జఫర్గడ్ మండలం అల్వార్ బండ తండాలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యవంతమైన గ్రామ నిర్మాణానికి సహకరించాలని సర్పంచ్ అరుణశ్రీ కోరారు. సోమవారం ఆమె తడి, పొడి చెత్త సేకరణ కోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసిన త్రిచక్ర వాహనాన్ని ప్రారంభించారు. సిబ్బంది ప్రతిరోజూ వార్డుల నుండి చెత్తను సేకరిస్తారని,ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.