KMR: పిట్లం మండలంలోని చిన్న కొడఫ్గల్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ధర్మారం తండాకు చెందిన జాదవ్ రాజు (28) మృతి చెందారు. ఆదివారం తన వాహనం ఫైనాన్స్ కట్టడానికి బైక్పై పిట్లం వెళ్లి వస్తుండగా, బైక్ అదుపుతప్పి పొలాల్లో పడిపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు సోమవారం ఎస్సై వెంకట్రావు తెలిపారు.