ప్రకాశం: మార్కాపురంలో బహిరంగంగా మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో బహిరంగంగా మద్యం తాగుతున్న ప్రాంతాలను గుర్తించి పోలీసులు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శుభ్రం చేశారు. ఇకపై ఆ ప్రాంతాలపై నిఘా ఉంటుందని బహిరంగంగా మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని మందుబాబులను హెచ్చరించారు.