AKP: మాడుగుల మండల సర్వసభ్య సమావేశం వచ్చేనెల 2వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కె. అప్పారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ వెంకటరాజా రామ్ అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు మండల పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందన్నారు. ఈ మేరకు ఎంపీటీసీలు, సర్పంచులకు ఆహ్వానాలు పంపించామన్నారు. అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలన్నారు.