NLG: వాణిజ్య గ్యాస్ కొరతను నిరసిస్తూ దేవరకొండలో హోటళ్లు, వ్యాపార సంస్థల బంద్కు నిర్వాహకులు పిలుపునిచ్చారు. తోపుడు బండ్లు, టీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నిత్యం జరుగుతున్న దాడులు, అధిక పన్నుల భారం తగ్గించాలని కోరారు. గ్యాస్ కొరతను వెంటనే తీర్చాలని వారు విజ్ఞప్తి చేశారు.