AP: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇవాళ సీఎం చంద్రబాబు సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొంటారు. నాయుడుపేట మండలం పుదూరులో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తారు. అనంతరం లబ్ధిదారులతో సమావేశమవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం ప్రజావేదిక సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి తిరుపతికి చేరుకుంటారు.