MBNR: బోయపల్లిలో వాయుపుత్ర యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివాజీ ధైర్యం, దేశభక్తి యువతకు గొప్ప ఆదర్శమని పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని పిలుపునిచ్చారు.