సత్యసాయి: జిల్లాలో ‘పీ4’ కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నిర్వహించనున్న వేడుకలపై కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అధికారులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాల్లో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరపాలని, మార్గదర్శులు, బంగారు కుటుంబాలను భాగస్వాములను చేయాలని ఆదేశించారు.