NGKL: బిజినపల్లి మండల కేంద్రానికి చెందిన మేస్త్రి సంఘం సభ్యులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హైదరాబాదులోని తన నివాసంలో పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పని చేయాలని సూచించారు.