NDL: ఆళ్లగడ్డ మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి, భూదేవి అమ్మవారిని ఆలయముఖ ద్వార మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, కర్పూరం వంటి లేపనాలు సమర్పించి ధూప దీపాలతో మహా మంగళహారతి అందించారు.