కోనసీమ: జిల్లాలో బెట్టింగ్ కి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ బుకీలు నిర్వాహకులపై ప్రత్యేక పోలీసు బృందాలతో నిరంతర నిఘా ఉంచినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.