NLG: గ్యాస్ సరఫరాలో ఏర్పడిన తీవ్ర కొరతను నిరసిస్తూ చిరు వ్యాపారులందరూ ఏకమై మార్చి 30న ‘స్వచ్ఛంద బంద్’కు పిలుపునిచ్చారు. గత కొంతకాలంగా గ్యాస్ సరఫరాలో ఎదురవుతున్న ఆటంకాల వల్ల చిరు వ్యాపారాలు కుదేలవుతున్నాయని పేర్కొన్నారు. దీనికి తోడు సివిల్ సప్లై అధికారులు చేస్తున్న దాడులతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.