SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ మేరకు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శంకర్, రమణ మూర్తి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు.