AP: వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట రాములోరి కళ్యాణానికి తిరుమల శ్రీవారి లడ్డూలను టీటీడీ సిద్ధం చేసింది. 85 వేల లడ్డూలను టీటీడీ అధికారులు పంపిస్తున్నారు. 300 మంది శ్రీవారి సేవకుల ద్వారా ప్యాకింగ్ చేయించింది. ప్రత్యేక వాహనాల ద్వారా ఒంటిమిట్టకు లడ్డూలను పంపించనుంది.