KRNL: అమరావతి విషయంలో రైతులను మోసం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని YCP జిల్లా అధ్యక్షుడు SV మోహన్ రెడ్డి ఇవాళ ఆరోపించారు. అసెంబ్లీలో రాజధాని బిల్లును ఏకపక్షంగా ప్రవేశపెట్టారని, శాసనమండలిలో మాత్రం భయంతో ప్రవేశపెట్టలేదని విమర్శించారు. అమరావతి పేరుతో అవినీతి, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ వెంటనే మండలిలో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.