ATP: అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం నిర్వహించిన ‘ఏఐ హ్యాకథాన్ 2026’ ముగింపు వేడుకల్లో జిల్లా ఎస్పీ పి.జగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సైబర్ నేరాల నియంత్రణ, ఎఫ్ఐఆర్ డేటా సేకరణలో ఏఐ సాంకేతికత విప్లవాత్మక మార్పులు తెస్తుందని పేర్కొన్నారు.