TG: నియోజకవర్గాల పునర్విభజన అంటే సీఎం రేవంత్రెడ్డి జంకుతున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. చట్టసభల్లో 50శాతం సీట్లు పెంచుతున్నామంటే.. ఉత్తరాది, దక్షిణాది అని వక్రీకరించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మహిళల సాధికారత కోసం చట్టసభల్లోనూ 33 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చేలా మోదీ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.