PPM: కురుపాం మండల కేంద్రంలోని నూకాలమ్మ గుడి వద్ద 3 ఏళ్ల చిన్నారి ఉత్తేజ్పై కుక్క దాడి చేసి కంటి వద్ద గాయపరిచింది. అలాగే, శివన్నపేటలో ప్రసాద్ అనే యువకుడిపై కూడా దాడి చేశాయి. ఇద్దరికీ ప్రథమ చికిత్స అందించగా, చిన్నారిని మెరుగైన చికిత్స కోసం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు.