SRPT: విద్యుత్ షాక్‌తో వృద్ధురాలు మృతి చెందిన విషాద ఘటన చివ్వెంల గుంజలూరులో ఆదివారం జరిగింది. తన ఇంట్లో పని చేసుకుంటున్న క్రమంలో ఐరన్ గ్రిల్ డోర్‌కు విద్యుత్ తీగ తగలడంతో, అది గమనించని సుంకరి అంజమ్మ (75) షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించారు. మనవడు నరేష్ వర్మ ఫిర్యాదు మేరకు ఎస్సై మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.