JGL: పేదల సంక్షేమానికి అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలకు చెందిన బుర్ర సునీత నరాల వ్యాధితో బాధపడుతూ చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5 లక్షల ఎల్డీసీ మంజూరు చేసి కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రభుత్వం పేదల వైద్య అవసరాల కోసం ఎప్పటికప్పుడు సహాయం అందిస్తోందన్నారు.