MLG: వెంకటాపురం మండలం పాలెం గ్రామం వద్ద మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముకునూరు పాలెంకు చెందిన కంటి అశోక్,విష్ణు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అశోక్ పరిస్థితి విషమంగాఉండటంతో మెరుగైన చికిత్స కోసం ములుగు ఆసుపత్రకితరలించారు.