జగిత్యాల పట్టణంలోని CSI వెస్లీ చర్చిలో ఆదివారం క్రైస్తవులు ‘మట్టల ఆదివారం’ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మిషన్ కాంపౌండ్ లోని క్రైస్తవులు సండే స్కూల్ విద్యార్థులతో కలిసి ఈత మట్టలతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కూడా క్రైస్తవులు ఈ పండుగను ఆయా ఆలయాల పరిసరాల్లో ఈత మట్టలతో ఊరేగింపు నిర్వహించి, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.